తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు రావడం సాధ్యమేనా… పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే ఆకాంక్ష నాయకులలో ఉందా అంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం పిలిచి నాయకులకు బుజ్జగింపులు చేయడం, వార్నింగ్ ఇవ్వడం వంటివి చేస్తోంది.
ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా ఐకమత్యంతో ఉన్నట్టుగా వ్యవహరించినా, తర్వాత షరా మామూలు అన్నట్లుగానే వీరి వ్యవహారం ఉంటోంది.ఇదే తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది.రెండు సార్లు పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ అధిష్టానం అంచనా వేస్తున్నా, ప్రస్తుతం నేతల పరిస్థితి చూస్తుంటే అది కూడా అనుమానమే అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ రాజకీయ చక్రం తిప్పాల్సి ఉన్నా, ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది.ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉంది .ఈ రేసులో కాంగ్రెస్ వెనకబడిపోయింది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సీనియర్ నాయకులు ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ఆయనకు సహకారం అందించేందుకు వారు ఏమాత్రం ఇష్టపడడం లేదు .మే లో రాహుల్ సభ వరంగల్ లో నిర్వహించ తలపెట్టారు.దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తూ, భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ముందుగానే జిల్లాల వారీగా సమన్వయ కమిటీతో రేవంత్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయినా రేవంత్ రాకను కొంతమంది సీనియర్ నాయకులు ఇష్టపడడం లేదు.తమ జిల్లాలో తమ అనుమతి లేకుండా ఎలా పర్యటిస్తారు అంటూ ప్రశ్నించడం తో పాటు , సమావేశాలు నిర్వహించిన తాము హాజరు కాబోము అంటూ ప్రకటనలు చేస్తూ ఉండడం వంటివి కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.వరంగల్ సభ పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా భారీగా ఆశలు పెట్టుకుంది.కానీ ఇప్పుడు తెలంగాణ సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న పంచాయతీ కార్యకర్తలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది.
ఐసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే జిల్లాల నేతలు వివాదాలకు దిగుతుండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం తెలంగాణ సీనియర్ నాయకుల మధ్య చోటు చేసుకున్న గ్రూప్ రాజకీయాలు రేవంత్ విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు వంటివి తప్పక ప్రభావం చూపిస్తాయని కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆందోళన చెందుతోంది.







