కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ ఆలయంలో శనీశ్వరుడికి గరిక సమర్పించాల్సిందే?

మన సంప్రదాయాల ప్రకారం నవగ్రహాలలో శనీశ్వరుడును ఒకరిగా భావించే శనీశ్వరునికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.

ఎవరికైతే శని ప్రభావం దోషం ఉంటుందో వారు తప్పనిసరిగా శనీశ్వరునికి పూజలు చేయడం వల్ల గ్రహ దోష ప్రభావం నుంచి బయట పడతారు.

అయితే చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే ఎంతో ఆందోళన చెంది అతనికి పూజలు చేయడానికి భయపడతారు.అయితే శని ప్రభావం ఎప్పుడు ఎవరిపై చూపదు శనీశ్వరుడు ఎప్పుడూ కూడా చేసిన కర్మకు తిరిగి ఫలితాన్ని ఇస్తుంటాడు.

అయితే మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరాలంటే తిరునల్లూరు గ్రామంలో వెలిసిన శనీశ్వరాలయం సందర్శించాలి.పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో నలమహారాజు అనే రాజుకు శని ప్రభావం ఉండటం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అని ఆయన ఈ ఆలయంలో ఉన్నటువంటి నల్ల తీర్థంలో స్నానమాచరించి స్వామివారికి గరికను సమర్పించడం వల్ల అతని శని దోషం తొలగి పోయిందని చెబుతారు.

ఇక ఈ ఆలయంలో వెలసినటువంటి శనీశ్వరుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో గరికను సమర్పించడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతారు.

Their Wishes Will Be Fulfilled By Offering Garika To Shani In This Temple Garika
Advertisement
Their Wishes Will Be Fulfilled By Offering Garika To Shani In This Temple Garika

ఈ ఆలయంలో శనీశ్వరుడితో పాటు నల్ల నారాయణ అనే ఆలయం ఉందని శనీశ్వరుని పూజించినవారు నారాయణ స్వామిని కూడా దర్శించుకోవడం వల్ల ఎలాంటి శని ప్రభావ దోషాలు ఉండవని స్థానికులు చెబుతారు.ఇక ఈ ఆలయంలో వెలసిన శనీశ్వరుడికివాహనంగా బంగారంతో తయారుచేసిన కాకి ఉంది.ఉత్సవాల సమయంలో స్వామివారికి బంగారు తొడుగు వేసి స్వామి వారి మూల విరాట్ ను ఊరేగింపుగా తీసుకు వెళతారు.

ఈ ఉత్సవ సమయంలో ఎంతో మంది భక్తులు ఆలయానికి చేరి గరిక సమర్పిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు