విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ.... బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు!

సినీ నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఇంట్లో దొంగలు పడ్డారు నేడు ఉదయం తెల్లవారుజామున ఈయన ఇంట్లో దొంగతనం జరిగిందని విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అసలు విశ్వక్ ఇంట్లో దొంగతనం( Vishwak Sen House Theft ) ఎలా జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే.విశ్వక్ హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8లో నివసిస్తుంటారు అయితే నేడు ఉదయం దొంగ చొరబడి చేతికి అందిన కాడికి తీసుకువెళ్లారని తెలుస్తుంది.

విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది.విశ్వక్ సేన్ సోదరి వన్మయి ( Vanmayi ) బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది.అయితే వన్ మై బెడ్ రూమ్ లో ఉదయం వెళ్లి చూడగా వస్తువులన్నీ కూడా చిందరవందరిగా పడి ఉన్నాయి దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె అల్మారాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను పరిశీలించారు అయితే అక్కడ బంగారు( Gold ) ఆభరణాలు లేకపోవడంతో దొంగ ఆభరణాలను తీసుకువెళ్లారని గ్రహించారు ఈ క్రమంలోనే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా తెల్లవారుజామున 5.50 నిమిషాల ప్రాంతంలో.ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

ఇక ఆ వ్యక్తి గేటు తీసుకొని సరాసరి మూడవ అంతస్తులోకి వెళ్లి వెనుక డోర్ నుంచి వన్మయి బెడ్ రూమ్ లోకి వెళ్లారని గుర్తించారు అయితే 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన తిరిగి వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.అయితే ఈమె గదిలో సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకువెళ్లారని తెలుస్తోంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు