థియేటర్ల పున: ప్రారంభం ఒక క్లారిటీ వచ్చేసింది

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా షూటింగ్స్‌ అనుమతులు ఇవ్వడం జరిగింది.భారీ ఎత్తున షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి.

ఇక థియేటర్ల ఓపెన్‌ ఎప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సురేష్‌ బాబు వంటి నిర్మాతలు థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అవ్వడం మంచిది కాదంటున్నారు.

కాని కొందరు మాత్రం వెంటనే థియేటర్లు ఓపెన్‌ చేయాలని కోరుకుంటున్నారు.మొత్తానికి ప్రభుత్వాలు కూడా జులై నెల నుండి థియేటర్లు ఓపెన్‌కు అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గించి థియేటర్లను ఓపెన్‌ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందిందట.జులై 15 లేదా జులై చివరి వారంలో థియేటర్లు ఓపెన్‌ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.

Advertisement
Governaments Give The Green Signal To Open The Movie Theaters, Theaters, Governa

ఆగస్టు నుండి బొమ్మ పడనుందని ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.ఆగస్టులో సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మళ్లీ మునుపటి ఉత్సాహం కనిపించే అవకాశం ఉంటుందని అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

వైరస్‌ విజృంభిస్తున్నా కూడా ఖచ్చితంగా థియేటర్లను ప్రారంభించడం ఖాయం అంటున్నారు.

Governaments Give The Green Signal To Open The Movie Theaters, Theaters, Governa

సురేష్‌ బాబు మాత్రం థియేటర్లు సెప్టెంబర్‌ వరకు వాయిదా వేయడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.సినిమా పరిశ్రమలో షూటింగ్స్‌ ఇప్పుడే ప్రారంభం అయ్యాయి.కనుక థియేటర్లు వెంటనే ఓపెన్‌ చేస్తే మళ్లీ మూసి వేయాల్సి రావచ్చు అంటున్నారు.

దిల్‌రాజు, సురేష్‌బాబుతో పాటు ప్రముఖ నిర్మాతలు వచ్చే ఏడాది వరకు సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తిగా లేరు.కనుక థియేటర్లు ఓపెన్‌ అయినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు