టీడీపీ కి ప్రతిపక్ష హోదా రద్దే ? 

ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకుంటూ వెళ్తేనే రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ గా వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం గా తెలుగుదేశం పార్టీ ఉంది.

వైసీపీని దెబ్బ కొట్టడం తెలుగుదేశం లక్ష్యం కాగా,  తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టేందుకు, తమకు అడుగడుగునా ఇబ్బందికరంగా మారిన ఆ పార్టీ అడ్డు తొలుగించుకునేందుకు వైసీపీ రక రకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల తో పాటు, తిరుపతి ఉప ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో టిడిపి కి పట్టు దక్కకుండా చేసే పనిలో అధికార పార్టీ వైసీపీ ఉంది.దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను రద్దు చేసే అంశంపై వైసీపీ దృష్టిపెట్టినట్టు సమాచారం.

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం కు పైగా స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.దీంతో జోష్ మీద ఉన్న ఆ పార్టీ .రాబోయే ఎన్నికల్లో కూడా ఆ రేంజ్ లోనే సత్తా చాటుకోవాలనే ఆలోచనలో ఉంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు.

Advertisement
Ycp Government To Revoke Main Opposition Status Of Tdp, Chandrababu Naidu,TDP, Y

మరో ముగ్గురు , నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి అదేవిధంగా దూరమైతే, తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అవుతుంది.అందుకే ఇప్పుడు ఈ అంశంపై వైసిపి దృష్టి పెట్టింది.

తెలుగుదేశం పార్టీ పై అసంతృప్తి తో ఉంటూ , తమ వైపు వచ్చే టిడిపి ఎమ్మెల్యేలకు రకరకాల ఆఫర్ ఇవ్వడం,  రానున్న రోజుల్లో అన్ని విషయాల్లోనూ పూర్తిగా మద్దతు ఇస్తామని చెబుతూ,  వారిని టిడిపికి రాజీనామా చేయించి వైసీపీ కి అనుబంధంగా కొనసాగేలా చేయాలని , అలా చేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అవుతుందని, అప్పుడు టిడిపి ఇప్పుడున్న పరిస్థితుల కంటే మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారట.

Ycp Government To Revoke Main Opposition Status Of Tdp, Chandrababu Naidu,tdp, Y

పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, కృష్ణ ,గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యే లు కొంతమంది టీడీపీ ని వీడే ఆలోచనలో ఉన్నారట.ఇప్పటికే విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన శాసనసభ సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు.దానిపై అతి త్వరలో నిర్ణయం స్పీకర్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలోనే ఈ అంశాలపై వైసీపీ దృష్టిపెట్టి టీడీపీ ని మరింతగా దెబ్బ కొట్టే ఆలోచన చేస్తోంది.

టీడీపీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రద్దు అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కంటే మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు