చీరలో బ్యాక్ ఫ్లిప్ కొట్టిన మహిళ... సలాం కొడుతున్న నెటిజన్లు

పూర్వపు కాలంలో అసలు మహిళలు బయటకు వచ్చే వారు కాదు.బయటికి వచ్చే పరిస్థితి అసలు ఉండేది కాదు.

ఆ కాలంలో తెగించి ఎవరైనా బయటికి తన సొంత మార్గంలో నడవాలనుకుంటే ఇక ఆ మహిళ ఏదో తప్పు చేసినట్టుగా చూపించి ఆ మహిళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే పరిస్థితులు ఉండేవి.తెగించి వెళ్లినా సరే నువ్వు మహిళ.

మగవారితో సరి సమానంగా పోటీ పడలేదనే ఆలోచనతో ఉండేవారు.వారి కుటుంబమే అంటే వారి తల్లిదండ్రులే వారిని నిరుత్సాహపరిచే వారు.

ఇక ఆ పరిస్థితిలో పొలం పనులకు, ఇంట్లో పనులకు మాత్రమే వారి జీవితాలు అంకితమయిపోయాయి.మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆనాటి పరిస్థితులకు భిన్నంగా తయారయ్యాయి.

Advertisement
The Woman Who Hit The Back Flip In The Sari Netizens Saluting, Social Media, Vir

మగ వారితో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారు.మగ వారు మాత్రమే చేయగలరు అన్న ప్రతి పనిని మహిళలు చేసి తమ సత్తా చాటుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే మగ వారు వేయడానికే సాధ్యపడని బ్యాక్ ఫ్లిఫ్స్ ని అలవోకగా మహిళ వేస్తున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.సరే బ్యాక్ ఫ్లిఫ్స్ వేయడమే అసాధ్యమనుకుంటే, మరి చీరలో బ్యాక్ ఫ్లిఫ్స్ వేయడమంటే గ్రేట్ అని చెప్పవచ్చు.

నెటిజన్లను ఎంతగానో అబ్బురపరుస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

The Woman Who Hit The Back Flip In The Sari Netizens Saluting, Social Media, Vir
Advertisement

తాజా వార్తలు