రోళ్లు పగులుతున్నాయ్ ! 52 డిగ్రీలు దాటేసిన ఎండలు 

రోహిణి కార్తె ( Rohini Karte )అంటే రోళ్ళు పగిలే స్థాయిలో ఎండలు ఉంటాయి.నిజంగానే అంతకంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.రోహిణి కార్తె ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో , జనాలు అల్లాడిపోతున్నారు.

గతంలో ఎప్పుడు చూడని స్థాయిలో ఎండలు ఉన్నాయి.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .నిన్న ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.ఢిల్లీలోనే కాకుండా ఉత్తర భారత దేశంలో ఎండలు ప్రభావం అత్యధికంగా ఉంది.

దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.మొన్నటి వరకు తీవ్రంగానే ఎండలు కాసినా, మధ్యలో వర్షాలు పడడంతో అంతా రిలీఫ్ అయ్యారు .అయితే గతం కంటే తీవ్రంగా ఇప్పుడు ఈ ఎండలు నమోదు కావడంతో చాలామంది అనారోగ్యం పాలు అవుతున్నారు.

The Wheels Are Breaking 52 Degrees Of Sunshine, Sun, Heat Claimet, Uttaraprades
Advertisement
The Wheels Are Breaking! 52 Degrees Of Sunshine, Sun, Heat Claimet, Uttaraprades

 కేవలం ఉత్తారాది లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎండల ప్రభావం తీవ్రంగానే ఉంది . ఏపీ,  తెలంగాణ( AP, Telangana ) లోను అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.బీహార్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని అధికారులు చెబుతున్నారు .వెంటనే అక్కడ సెలవులు ప్రకటించాలని బీహార్( Bihar ) లోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.ఉత్తర ప్రదేశ్ లోనూ దాదాపు అదే పరిస్థితి.

అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు వెళ్లిన భక్తులు ఎండ ప్రభావానికి తమ గదులను వదిలి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు.

The Wheels Are Breaking 52 Degrees Of Sunshine, Sun, Heat Claimet, Uttaraprades

ఢిల్లీలోని మంగేష్ పూర్( Mangeshpur in Delhi ) లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.భారత్ లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.

దీని కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది.నిరంతరం ఏసీలు,  ఫ్యాన్లు తిరుగుతూ ఉండడంతో,  విద్యుత్ వాడకం కూడా విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

రాజస్థాన్ లోని పలోడి పట్టణంలో 501 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు