ఖమ్మం నగరంలో ఘరానా మోసం పాల్పడిన ఓ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భాదితులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు… ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన చెన్ను యాదగిరి అనే ఓ వ్యక్తి.తన భార్య కు ఉద్యోగం….
కావాలని ఖమ్మం జిల్లాలో వైరా స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూన్న తాళ్లూరి రామారావు (pc.no.2322) ను సంప్రదించాడు.ఇదే అదునుగా చేసుకొని 15 లక్షల ఒప్పందానికి రైల్వే ఉద్యోగం ఇప్పించడానికి 2019 లో డీల్ ఒకే చేసుకున్నాడు.
తొలి దఫా 10 లక్షలు ,రెండు దఫా 5లక్షల అగ్రిమెంట్ చేసుకొని.నగదు అందజేశారు.సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించక పోవడంతో మోసపోయాను అనీ భావించి 2022 జూలై ఖమ్మం సి పి విష్ణు వారియర్ పిర్యాదు చేశారు.విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సిపి హామీ ఇచ్చారు, న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తు ఇక లాభం లేదని శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టేరు తమ కు ఎలాగైనా న్యాయం చేయాలనీ జిల్లా కలెక్టర్ చెప్పి గోడు వెళ్లబోసుకున్నారు.
ఇంత జరుగుతున్నా వైరా పోలీస్ స్టేషన్ ఆ కానిస్టేబుల్ దర్జా గా ఉద్యోగం చేసుకోవడం కొస మెరుపు.ఈ ఘటన పై అధికారుల తీరు పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.