రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన టీవీ జర్నలిస్టు.. చివరికి..?

అస్సాం( Assam )లో భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి.ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్ ( Journalist )రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడ్డారు.ఆయన వరద పరిస్థితులను స్థానికంగా కవర్ చేస్తూ, నది ఒడ్డున నిలబడి రిపోర్టింగ్ మొదలుపెట్టారు.

అయితే, నేల తడిగా, మెత్తగా ఉంది అతని నిలబడ్డ భూమి ఒక్కసారిగా నదిలో పడిపోయింది.దీంతో జర్నలిస్ట్ కూడా పట్టు తప్పి నదిలో పడిపోయారు.

ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది.

The Tv Journalist Who Fell Into The River While Reporting.. In The End , Tv Repo
Advertisement
The TV Journalist Who Fell Into The River While Reporting.. In The End , TV Repo

జర్నలిస్ట్ స్వయంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు.స్థానికులు ఆయనకు సహాయం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో, జర్నలిస్ట్ కెమెరా ముందు నిలబడి, వరదల పరిస్థితులను వివరిస్తున్నారు.అయితే, ఆయన మాట్లాడుతున్న సమయంలోనే, కాలు జారి నదిలో పడిపోతారు.

ప్రాణాపాయమైతే తప్పింది.ఈ ఘటన వరదల తీవ్రతను తెలియజేస్తుంది.

వర్షాలు కారణంగా నీట మునిగిన రోడ్లు, నదులు ప్రమాదకరంగా మారాయి.

The Tv Journalist Who Fell Into The River While Reporting.. In The End , Tv Repo
స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఈ వీడియోను చూసిన నెటిజన్లు జర్నలిస్ట్ ధైర్యాన్ని అభినందిస్తున్నారు.అదే సమయంలో, వరద బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.మరోవైపు అస్సాంలో ఈ ఏడాది భారీ వర్షాలు( Heavy rains ) కురిశాయి.

Advertisement

దీంతో అనేక జిల్లాల్లో వరదలు సంభవించాయి.ANI నివేదిక ప్రకారం, వరదనీరు తగ్గుతున్నందున రాష్ట్రంలోని వరద పరిస్థితి కొంత మెరుగుపడింది.అయితే, 18 జిల్లాల్లో ఇంకా సుమారు 5.98 లక్షల మంది ప్రజలు వరద బాధితులుగా ఉన్నారు.

తాజా వార్తలు