షర్మిల సెక్యూరిటీ తొలగింపు ? ఆ ముద్ర పడకుండా జాగ్రత్తేనా ? 

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని గత కొంతకాలంగా హడావుడి చేస్తున్నారు వైఎస్ షర్మిల.

పార్టీ పేరు ఇంకా ప్రకటించకుండానే షర్మిల టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వ లోపాలను , ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం తామే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే షర్మిల ఎంత యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్న,  టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న , ఆమెను వెనుక ఉండి నడిపించేది టిఆర్ఎస్ పార్టీ పెద్దలేనని,  అసలు తెలంగాణలో పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహించింది వారేనని,  జగన్ తో కలిసి కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలను దెబ్బకొట్టి ప్రభుత్వ వ్యతిరేకత చీల్చడం ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రాజకీయంగా గత కొంత కాలంగా జోరందుకున్నాయి.అయితే దీనిని తిప్పికొట్టేందుకు అన్నట్లుగా షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సెక్యూరిటీని తీసి వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పదిహేను రోజుల క్రితమే షర్మిల కు తెలంగాణ ప్రభుత్వం 2+2 గన్ మెన్ లను కేటాయించింది.అయితే ఇప్పుడు ఆ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సమాచారం.

Advertisement

గత కొంత కాలంగా ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేస్తున్నారని , ఇటీవల నిరుద్యోగ దీక్ష సందర్భంగా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వం షర్మిల సెక్యూరిటీ ని ఉపసంహరించుకుంది అనే సంకేతాలను జనాల్లోకి పంపించే విధంగా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ వ్యవహారంలో షర్మిల పెద్దగా స్పందించకపోవడంతో దీనిపై ఇంకా రాజకీయ చర్చ పూర్తి స్థాయిలో మొదలవలేదు.

ఏదో రకంగా జనాల్లోకి షర్మిల పార్టీ తో తమకు సంబంధం లేదన్నట్లుగా టిఆర్ఎస్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలకు దిగినట్లుగా బిజెపి కాంగ్రెస్ పార్టీల నాయకులు అనుమానిస్తున్నారు.అయితే షర్మిల పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.

అసలు టిఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయం గానే తెలంగాణలో పార్టీ స్థాపించబోతున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని, కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లను ఎదుర్కుంటూనే తాము రాజకీయంగా తెలంగాణలో పట్టు సాధిస్తాం అంటూ షర్మిల పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.అయినా ఈ విషయంలో మాత్రం అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి.

మొదట్లో షర్మిల రాజకీయ అరంగేట్రంపై టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు విమర్శలు చేసినా, ఆ తర్వాత పెద్దగా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తున్నారు.అయితే ఇప్పుడు షర్మిల సెక్యూరిటీ తీసి వేశారనే హడావుడి జరుగుతోంది తప్ప , ఇది అధికారికంగా నిర్ధారణ కాకపోవడం తో అసలు విషయం ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు