అవును, మీరు వింటున్నది నిజమే.మీరు హైదరాబాద్ వాసులైతే మీకోసమే ఈ కధనం.
ఇప్పటికే వాహనదారులు గత 3 రోజులుగా దారుణమైన ట్రాఫిక్ తో నానా అవస్థలు పడుతున్నారు.మరీ ముఖ్యంగా ఈ బుధవారం ట్రాఫిక్ సమస్య మరీ దారుణంగా తయారైంది.
ట్రాఫిక్ మల్లింపుల కారణంగా ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు వరకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడం బాధాకరం.ఇక ఎటుచూసినా ట్రాఫిక్ జామ్ ఉండడంతో.
రోడ్డు దాటేందుకు పాదచారులకు కూడా నరకం కనబడింది అని చెప్పుకోవచ్చు.

అయితే ఈ నేపథ్యంలో నగర వాసులకు మరో 10 రోజుల పాటు ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.ఒకవైపు శాసనసభా సమావేశాలు, మరోవైపు ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసింగ్ మొదలవనుంది.ఈ కారణాలే ఇపుడు హైదరాబాద్ ట్రాఫిక్ ని ఇంకాస్త టైట్ చేసేసాయని నిపుణులు చెబుతున్నారు.
ఫార్ములా-ఈ రేసింగ్ కోసం దారి మల్లింపు చర్యలు చేపడుతున్నారు.ఇక ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరగనుండగా.
ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభం కానుంది.ఇక ఫిబ్రవరి 18న శివరాత్రి వేడుకలు జరగనున్నాయి.

వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 రోజుల వరకు నగరంలో వాహనదారులు నరకం చూడక తప్పదు.ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా.పరిస్థితి అదుపులో లేకపోవడం కొసమెరుపు.ఈ క్రమంలో గత 2-3 రోజులుగా కిలోమీటరు దూరానికే 50-60 నిమిషాలు పడుతోందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మాసబ్‌ట్యాంక్ నుంచి ఖైరతాబాద్‌కు 45 నిమిషాలు సమయం పట్టిందంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో హైదరాబాద్ ట్రాఫిక్ పైన పెద్ద పోస్తే పెట్టాడు.ట్రాఫిక్ సమస్య మరింత పెరిగేందుకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమని మరోవైపు పోలీసులు అనడం కొసమెరుపు.







