పట్టుదల లోపించిన పసుపు సైన్యం?

ప్రాంతీయ పార్టీల కార్య కర్తలను పోల్చి చూసినప్పుడు ఏ పార్టీకి కనిపించని బలమైన వ్యవస్థాపకృతమైన మరియు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ( TDP ) సొంతం.

ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి అనేకమంది నాయకులను తెలుగు నేలకు అందించిన పార్టీ అవడం మూలాన ప్రజలలోని అనేక వర్గాల నుంచి ఈ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు.

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాయకులు వెళ్లిపోయినా కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉండే కార్యకర్తలకు వేరే ఏ పార్టీకి ఉండారంటీ అతిశయోక్తి కాదు.అయితే తమ పార్టీ చరిత్ర లో ఇంతవరకూ జరగనటువంటి తీవ్ర పరిణామం జరిగినప్పుడు మాత్రం కార్య కర్తల స్పందన చర్చనీయాంశం గా మారింది .అరెస్ట్ ని అడ్డుకోవడం లో గాని తమ నిరసన ల బలాన్ని చూపించడం లో గాని కార్య కార్తల స్పందన ఆశించినంతగా లేదని చెప్పవచ్చు.

పార్టీ పట్ల నిరాసక్తత తో ఉన్నారా ? లేక ప్రభుత్వ దూకుడుకు భయపడుతున్నారో తెలియదు గానీ చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ తదనంతర పరిణామాలలో కార్యకర్తల స్పందన చాలామంది రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.తమ పార్టీ అధినేతను అరెస్టు చేశారన్న ఆక్రోదన అయితే కనిపించింది కానీ తమ సంఘటిత శక్తిని చూపించాలన్న పట్టుదల మాత్రం కార్యకర్తలలో కనిపించలేదు.ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేయనివ్వకుండా కార్యకర్తలు భారీ ఎత్తున అడ్డుపడుతున్నారంటూ సిబిఐ( CBI ) కంప్లైంట్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది.

అలాంటప్పుడు ఒక పార్టీ అధినేతను అరెస్టు చేస్తే కనీస పోరాటపటము కూడా చూపించకుండా నిష్క్రియా పర్వానికి తెలుగుదేశం శ్రేణులు లోనయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి.ఒకరకంగా జన సైనికుల తెగింపు చూసి తెలుగుదేశం కార్యకర్తలు నేర్చుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అనేకమంది వ్యాఖ్యానించారు.

Advertisement

హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) అడ్డుకోవడానికి పోలీస్ శాఖ రెండు మూడుసార్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ,అర్ధరాత్రి వేళ ఆడా ,మగ తేడా లేకుండా కార్యకర్తల రోడ్డుపైకి వచ్చి పోలీసులను నిరోధించిన తీరు కానీ, నిరసన వ్యక్తం చేసిన పద్ధతి గాని తెలుగుదేశం శ్రేణులకు నేర్చుకోవాల్సిన పాఠం గానే మిగిలింది అన్నది కొంతమంది వాదన .జనసైనికులు నిరసనలతో వెనక్కి తగిన పోలీసులు చివరకు వారే కాన్వాయ్ గా వచ్చి పవన్ను మంగళగిరి ఆఫీసులో వదిలిపెట్టారు.దీనిని బట్టి రాజకీయ కార్యకర్తలు చూపించాల్సిన పట్టుదల ఏ స్థాయిలో ఉండాలో జనసేన( Janasena ) పాఠం నేర్పినట్టు అయ్యింది .మరి ఇప్పటికైనా ప్రభుత్వ చర్యలపై పసుపు సైన్యం గట్టిగా పోరాడుతుందో లేదో చూడాలి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు