మంచు విష్ణు( Vishnu Manchu ) హీరోగా చేస్తున్న భక్తకన్నప్ప( Kannappa movie ) సినిమాలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద సోషల్ మీడియా లో విపరీతమైన వార్తలైతే వస్తున్నాయి.
అయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎవరు కూడా క్లారిటీగా చెప్పడం లేదు.అయినప్పటికీ ఇప్పటికే శివుడి పాత్రలో ప్రభాస్ చేస్తానని ఒప్పుకున్నట్లు గా మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) ఈ సినిమాలో 25 నిమిషాల పాటు కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఇది చూసినా అభిమానులు చాలా ఆనందపడతున్నారు అంటూ సినిమా యూనిట్ ఇన్ డైరెక్ట్ గా వాళ్లలో అంచనాలను పెంచేస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ నెల చివరి వారంలో ప్రభాస్ శివుడి గెటప్ కి లుక్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది.ఇక ఈ నెల 22, 23, 24 వ తేదీల్లో ప్రభాస్ లుక్స్ టెస్ట్ చేసి వాటిని రిలీజ్ చేయబోతున్నాడు అంటు వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా విషయంలో మంచు విష్ణు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.మంచు విష్ణు మార్కెట్ కేవలం 15 కోట్లు అయినప్పటికి 150 కోట్లు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమా ప్రభాస్( Prabhas ) మీదనే డిపెండ్ అయి నడుస్తుంది./br>
దానికోసమే ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది.మరి 25 నిమిషాల పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడు, అలాగే ఆయన మీదనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్న మంచు విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
.