Prabhas Chakram Movie : ఆ సీన్ లో ప్రభాస్ కి కట్ చెప్పలేకపోయిన కృష్ణవంశీ కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో ప్రభాస్.( Prabhas ) ఈయన కెరియర్ మొదట్లో చేసిన ఈశ్వర్, రాఘవేంద్ర లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

 The Reason Why Krishnavamsi Could Not Tell Prabhas To Cut In That Scene-TeluguStop.com

ఇక దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సినిమాల మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందాడు.

కాబట్టి ఆయనని ఆపడం ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి.ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘ సలార్’ ( Salaar ) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.

 The Reason Why Krishnavamsi Could Not Tell Prabhas To Cut In That Scene-Prabhas-TeluguStop.com

ఇక దాంతో ఆయన ఒక్కసారిగా మళ్లీ తన పంజా దెబ్బ ను బాక్సాఫీస్ మీద రుచి చూపించాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Telugu Salaar, Baahubali, Brahmanandam, Chakram, Chakram Scene, Chakramtrain, Kr

ఎందుకంటే బాహుబలి కేవలం రాజమౌళి వల్లే సక్సెస్ సాధించింది.అంతే తప్ప ప్రభాస్ కి భారీ హిట్టు కొట్టేంత సత్తాలేదు అంటూ అప్పట్లో చాలామంది ప్రభాస్ ని విమర్శించారు.అయినప్పటికీ ప్రభాస్ ఏ మాత్రం డీలాపడకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.ఇక ఈ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ప్రభాస్ ని డీ కొట్టే హీరో లేడు అనేంత లా తన మార్కెట్ ను విస్తరించుకుంటూ వస్తున్నాడు.

Telugu Salaar, Baahubali, Brahmanandam, Chakram, Chakram Scene, Chakramtrain, Kr

అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ చక్రం సినిమాలో( Chakram Movie ) ఒక సీన్ చేసేటప్పుడు నిజంగానే ఏడ్చాడట,ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభాస్ ఇద్దరూ కలిసి ట్రైన్ లో వెళ్తుంటే వాళ్లకి బ్రహ్మానందం కనిపిస్తాడు అక్కడ కామెడీగా సాగే సీన్ లోనే ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి.ఆ సీన్ లో ప్రభాస్ కి నిజంగానే కండ్ల ల్లో నుంచి నీళ్లు రావడం గమనించిన కృష్ణవంశీ( Krishnavamsi ) ఆ సీన్ అయిపోయే దాకా అసలు కట్ చెప్పకుండానే చూస్తూ ఉండిపోయాడట.ఆ సీన్ లో ఉన్న డెప్త్ ని ప్రభాస్ కి వివరం గా చెప్పడం లో కృష్ణవంశీ సక్సెస్ అయితే, ఆ సీన్ కి ప్రాణం పోసిన నటుడు మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube