బీజేపీ ని భయపెడుతున్న ఈటెల.. కారణం..?

ఎప్పుడైతే ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ ని వదిలి బీజేపీ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి బిజెపి అధిష్టానం మొదటి నుండి సీనియర్ నాయకులుగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టి ఈటెల రాజేందర్ ని ఫాలో అయ్యారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం ఈటెల రాజేందర్ చెప్పినట్లే జరిగింది.

ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు.అలాగే బిజెపి అధిష్టానం అప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కట్టుబడి ఉండేది.

కానీ ఎప్పుడైతే ఈటెల ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి మొత్తం ఆయనకి అనుగుణంగానే జరిగింది.మరీ ముఖ్యంగా బండి సంజయ్ ( Bandi Sanjay ) ని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణం కూడా ఈటెల రాజేందర్ అని,ఆయన వల్లే బండి సంజయ్ తన అధ్యక్ష పదవిని కోల్పోయారంటూ ఇప్పటికే బండి వర్గీయులు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

The Reason For The Etela That Are Scaring The Bjp , Etela Rajender , Bjp, Amith

అయితే తాజాగా అమిత్ షా ( Amith shah ) తెలంగాణలోకి వచ్చారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నాయకులకు దిశా నిర్దేశం చేయడం కోసం తెలంగాణకు వచ్చారు.అయితే అమిత్ షా బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న వర్గ పోరు ని ఖండించారు.

Advertisement
The Reason For The Etela That Are Scaring The BJP , Etela Rajender , Bjp, Amith

అంతే కాదు వీరిద్దరిపై సీరియస్ అయినట్టు కూడా వార్తలు వినిపించాయి.ఇక ఇదంతా ఇలా ఉంటే ఈటెల రాజేందర్ బిజెపి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

గత రెండు మూడు రోజుల నుండి ఈటెల రాజేందర్ బీజెపిని వీడి కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది.ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్ కోసం వేచి చూస్తున్నారు.

కానీ ఈయన తెలంగాణ ఉద్యమ నాయకుడు అయినప్పటికీ కరీంనగర్ లేదా మెదక్ ( Medak ) లో మాత్రమే ఈయనకు ప్రజాధరణ ఉంది.వేరే ఎక్కడ పోటీ చేసినా కూడా ఈటెల రాజేందర్ గెలుస్తారనే నమ్మకం లేదు.

దాంతో ఆయన మెదక్ లేదా కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వాలని కోరారట.

The Reason For The Etela That Are Scaring The Bjp , Etela Rajender , Bjp, Amith
న్యూస్ రౌండప్ టాప్ 20

కానీ ఈటెల కంటే ముందే సీనియర్ నాయకులైన బండి సంజయ్ కరీంనగర్ ( Karimnagar ) నుండి ఎప్పటినుండో ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు.అలాగే ఈసారి మెదక్ లో రఘునందన్ రావుకి ఎంపీ సీటు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బిజెపి అధిష్టానాన్ని బండి సంజయ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారట.

Advertisement

నాకు ఈ రెండు స్థానాలలో ఏదో ఒకచోట ఎంపీ సీటు ఇస్తేనే పార్టీలో ఉంటాను.లేకపోతే కాంగ్రెస్ (Congress) లోకి వెళ్తాను అని భయపెడుతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈయన కాంగ్రెస్ కి వెళ్తున్నట్టు వినిపించిన వార్తలను ఈటెల ఖండించి నేను ఎక్కడికి వెళ్లడం లేదు బిజెపిలోనే ఉంటున్నాను అని స్పష్టం చేశారు.అయినప్పటికీ కూడా ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అనే ప్రచారం ఆగడం లేదు.

ఏది ఏమైననప్పటికీ ఈటెలకి కరీంనగర్ లేదా మెదక్ ఎంపీ సిటు ఇస్తారా లేదా అనేది మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

తాజా వార్తలు