కానుకలు తీసుకోవద్దన్నారని స్వామివారి పూజనే ఆపేసిన అర్చకుడు.. ఎక్కడంటే..

గత కొద్ది రోజులుగా కాణిపాకం దేవాలయం వరుస వివాదాల్లో చిక్కుకొని ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని చాలామంది ప్రజలు బాధపడుతున్నారు.

తాజాగా సొంత స్వార్థం కోసం ఏకంగా భగవంతునికి నిర్వహించాల్సిన కార్యాన్ని నిలిపివేసిన ఘటన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధ దేవాలయం గా పిలిచే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్వయంభుగా భావిలో వేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం ప్రతినిత్యం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అయితే ఇక్కడ గణేశుడు సత్య ప్రమాణాలను సాక్షాత్తుగా వీరజిల్లుతున్నాడు.

అందుకే ప్రతి రోజు దాదాపు 30 నుండి 40 వేల మంది వరకు భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో కొందరు అర్చకుల వ్యవహార శైలి అధికారులకు తలనొప్పిగా మారింది.

ఈ దేవాలయంలో రోజుకో వివాదాన్ని తెచ్చిపెట్టి మరి దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం విరాళంగా ఇచ్చిన బంగారు విభూదిపట్టిని అర్చకుడు తీసుకున్నాడని ఘటనను మరువకముందే మళ్లీ అర్చకులు ఏకంగా ఆలయానికి అనుబంధ దేవాలయం అయిన శ్రీ ఆంజనేయ స్వామికి నిర్వహించాల్సిన అభిషేకాన్ని నిలిపివేయడం జరిగింది.

Advertisement
The Priest Who Stopped The Puja Of Swami Because He Did Not Want To Take Gifts ,

సోమవారం ఉదయం కాణిపాకం దేవాలయం ఈవో వెంకటేష్ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానుకల తట్టా ఉంచరాదని ఆదేశించాడు.

The Priest Who Stopped The Puja Of Swami Because He Did Not Want To Take Gifts ,

అయితే ఈవో ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని అర్చకుడు యధావిధిగా కానుకల తట్టా ఉంచాడు.దీనిని గమనించిన దేవాలయ అధికారి కానుకల తట్టా ఉంచరాదని మరోసారి అర్చకుడిని ఆదేశించారు.కానుకల తట్ట ఉంచకూడదని చెప్పినందుకు ఆగ్రహించిన ఆంజనేయస్వామి దేవాలయ అర్చకుడు మంగళవారం ఉదయం ఐదు గంటల నిర్వహించాల్సిన అభిషేకాన్ని నిర్వహించకుండా అలాగే ఉండిపోయాడు.

అదే సమయంలో అక్కడ ఉన్న దేవాలయ సిబ్బంది, భక్తులు ఇదేంటని ప్రశ్నించిన ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోయాడు.ఏది ఏమైనాప్పటికీ కాణిపాకం ఆలయంలో అర్చకుల వ్యవహార శైలి రోజురోజుకు ఎందుకు వివాదాస్పదంగా మారుతుందో తెలియడం లేదు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు