ఈ కాఫీ ధర అక్షరాలా రూ.28 వేలట.. దీని విశేషాలు తెలిస్తే..!

ఇటీవల తాజ్‌ మహల్ ప్యాలస్‌లో( Taj Mahal Palace ) ఒక టీ ధర రూ.2,000ల పై చిలుకే అని చెప్పే వీడియో వైరల్‌గా మారి చాలామందికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు దానికి పది రెట్లు ఎక్కువ ధరతో ఓ కాఫీ డ్రింక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్కాట్లాండ్‌లోని మోస్గీల్ ఆర్గానిక్ డెయిరీ ( Mosgeil Organic Dairy in Scotland )అనే డెయిరీ ఫామ్ యూకేలోనే అత్యంత ఖరీదైన కాఫీని తయారు చేసింది.అదే రూ.28,000ల ఖరీదైన ఫ్లాట్ వైట్ కాఫీ! ఒక సాధారణ కాఫీ ధర కంటే ఇది 80 రెట్లు ఎక్కువ! అయితే ఇంత ఖరీదు ఎందుకు? ఈ డబ్బులతో కాఫీ షాప్ ఏ పెట్టేయొచ్చు, మరి ఈ కప్పు కాఫీలోని స్పెషాలిటీ ఏంటి.వివరాల్లోకి వెళ్తే, ఈ ఫామ్ ఒక ప్రత్యేకమైన క్రౌడ్‌ఫండింగ్ ప్రోగ్రామ్‌( Crowdfunding program ) ప్రారంభించింది.ఈ కార్యక్రమం ద్వారా రూ.28,000లు ఇచ్చే వారికి ఆ ఫామ్‌లో కొంత వాటా ఇస్తారు.దానికి బదులుగా, వాళ్లకి ఆ ఖరీదైన కాఫీ, ఫామ్ యజమాని అని నిరూపించే ఒక సర్టిఫికేట్, ఫామ్‌ని చూసే అవకాశం, పాలు ఇంటికి తెప్పించుకునేటప్పుడు డిస్కౌంట్, ఫామ్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకి ఆహ్వానం లాంటివి ఇస్తారు.

ఈ కాఫీని స్కాట్లాండ్‌లోని 13 కేఫ్‌లలో కూడా అమ్ముతారు.

మోస్గీల్ ఆర్గానిక్ డెయిరీ( Mosgiel Organic Dairy ) తమ పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది.దీనికోసం వారు రూ.3 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ డబ్బుతో పాటు మరో రూ.9 కోట్ల రుణం కూడా తీసుకోబోతున్నారు.ఈ డబ్బుతో లండన్‌లో తమ పాలను మరింత ఎక్కువగా అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా, పర్యావరణానికి హాని చేయకుండా, నైతికంగా పాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఫామ్ పని చేస్తోంది.

ఇది చాలా ప్రత్యేకమైన ఫామ్.ఎందుకంటే, ఈ ఫామ్‌ ఉన్న భూమిలో స్కాట్లాండ్‌కు చెందిన ప్రముఖ కవి రాబర్ట్ బర్న్స్ ఒకప్పుడు వ్యవసాయం చేసేవారు.అందుకే, ఈ ఫామ్‌ నుంచి వచ్చే ప్రతి పాలు బాటిల్‌పై రాబర్ట్ బర్న్స్ ఫోటో ఉంటుంది.

అంటే, ఈ ఫామ్ కేవలం పాలు ఉత్పత్తి చేసేది కాదు.అది స్కాట్లాండ్‌కు ఒక సంస్కృతిక చిహ్నం కూడా.మోస్గీల్ ఆర్గానిక్ డెయిరీ యజమాని బ్రైస్ కన్నింగ్‌హామ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎకోఫ్రెండ్లీ అగ్రికల్చర్ ఫ్యూచర్‌ను కోరుతున్నారు.

వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!
Advertisement

తాజా వార్తలు