ప్రముఖ హై-ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్ బ్యాలెన్సియాగా( Balenciaga ) తరచుగా సరికొత్త డ్రెస్సులు, టవల్స్, బ్యాగ్స్ లాంచ్ చేస్తుంది.అయితే వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల ప్రతిసారి ఈ కంపెనీ ఆ వివాదాస్పద దుస్తుల వల్ల ట్రోలర్స్ బారిన పడుతుంది.తాజాగా ఈ కంపెనీని నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ బ్రాండ్ రీసెంట్గా నడుము చుట్టూ ధరించే బాత్ టవల్ టవల్‌ను పోలి ఉండే స్కర్ట్‌ను పరిచయం చేసింది.దీని ధర అక్షరాలా రూ.77,000 ($925)గా నిర్ణయించింది.అంటే దాదాపు ఒక ఐఫోన్ ధరకు సమానం.
ఈ స్కర్ట్ పారిస్( Paris )లో షో చేసిన స్ప్రింగ్ 2024 కలెక్షన్లో ఒక భాగం.ఇదొక యునిసెక్స్ క్లాత్ అంటే, ఇది వివిధ సైజులకు సరిపోయేలా అడ్జస్ట్ అవుతుంది.స్కర్ట్‌ను డిజైనర్ డెమ్నా గ్వాసాలియా తయారు చేశాడు.ఆయన జార్జియన్లో జన్మించిన ఒక క్రియేటివ్ డైరెక్టర్.ఫ్యాషన్‌లో క్వాలిటీ దుస్తులను తయారు చేసి బాలెన్సియాగాకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాడు.
అయితే, అతని వర్క్ నెటిజన్లను ఆకట్టుకోలేదు, అందుకే ఇప్పుడు వారు ఆ డిజైన్ బ్రాండ్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.టవల్‌గా కనిపించే ఈ స్కర్ట్ కోసం ఇంత భారీ మొత్తం ఎవరు చెల్లిస్తారని ఏకిపారేస్తున్నారు.మీమ్లను క్రియేట్ చేసి మరీ ఈ కంపెనీని ట్రోల్ చేశారు.
కొందరు మాములు తువ్వాలను ఉపయోగించి సొంత స్కర్ట్ టవల్ వెర్షన్‌ను తయారు చేసుకోవచ్చని కూడా సూచించారు.బ్యాలెన్సియాగా బాత్ టవల్( Bath towel )లను కూడా విక్రయిస్తుంది, వీటి ధర రూ.31,572గా కంపెనీ నిర్ణయించింది.ఈ తువ్వాళ్లను ప్యూర్ కాటన్‌తో తయారు చేశారు, ఇది రెండు రంగులలో ఉంటాయి – తెలుపు, బూడిద రంగులలో లభిస్తుంది.
బాలెన్సియాగాకు అధిక ధరల వల్ల ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి కాదు.గతంలో, బ్రాండ్ IKEA షాపింగ్ బ్యాగ్‌లా కనిపించే దానిని 2,145 డాలర్లు, షర్టుతో కూడిన T-షర్టును 1,290 డాలర్లు, ఏడు పొరల దుస్తుల కోటును 9,000 డాలర్ల ధరకు సేల్కు తీసుకొచ్చి ఈ కంపెనీ ఆగ్రహం తెప్పించింది.