మునుగోడు ఎన్నికల ప్రచారంలో అపశృతి

మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌ మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరగణం స్వైరవిహారం చేసింది.

సోమవారం ప్రచార సమయం ముగిసిన తర్వాత రాత్రి బాగా పొద్దుపోయాక గ్రామాలకు వచ్చిన బీజేపీ అభ్యర్థి.

ఆయన అనుచర గణం తమ వాహనాల్లో ముందే తెచ్చుకొన్న రాళ్లు, కర్రలతో గ్రామస్థులపైన, కవరేజీకి వచ్చిన పాత్రికేయులపైన విచ్చలవిడిగా దాడి చేశారు.రాజగోపాల్‌రెడ్డి.

చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామ పరిధి రెడ్డిబావి (సైదాబాద్‌)కి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చారు.ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేండ్లు అయినా ఎన్నడూ గ్రామానికి రాలేదని.

ఇప్పుడెందుకొచ్చారని గ్రామస్థులు నిలదీశారు.చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం ప్రజలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కిరాయి గూండాల దాడిని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

Advertisement

గ్రామస్థులపై దాడిచేయడం హేయమైన చర్య అన్నారు.వార్తను కవర్‌చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపైనా దాడి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేగా ఓటువేసిన పాపానికి ప్రజలపైనే తిరగబడటం ఏమిటని ప్రశ్నించారు.ప్రజలపైనే గూండాగిరీ చేసిన బీజేపీ అభ్యర్థికి గుణపాఠం తప్పదన్నారు.

అంకిరెడ్డి గూడెంలో కార్లలో కట్టెలు, రాళ్లు తీసుకొచ్చి.టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపైనా.

పార్టీ ఆఫీసుపైనా దాడిచేసి అరాచకం సృష్టించడం హేయమన్నారు.ఇలాంటి వ్యక్తులకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు