రేవంత్ రెడ్డి కి రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ..కాంగ్రెస్ విజయం లాంఛనమేనా!

తెలంగాణాలో ఈసారి బీఆర్ఎస్( BRS ) పార్టీ అధికారం లోకి రావడం కష్టమేనా.?, గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ పై ఇప్పుడు అన్నీ వర్గాలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది అని, ముఖ్యంగా జాబ్ క్యాలండర్ విషయం లో యువత ని దారుణంగా మోసం చేసింది అనే భావన ప్రతీ ఒక్కరిలో ఏర్పడింది అని అందుకే ఈసారి అధికారం దక్కడం కష్టమని చెప్తున్నారు.

మరో పక్క కాంగ్రెస్ పార్టీ ( Congress )వైపు అధికార గాలి వీస్తుంది.

జనాలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ని ఈసారి గెలిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.గత ఎన్నికలలో కేవలం 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది కాంగ్రెస్ పార్టీ.

బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ తో అధికారం లోకి వచ్చింది.ఈసారి అలాంటి పరిస్థితులు లేవు అంటే, బీఆర్ఎస్ పార్టీ పై జనాల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

The Popularity Of Revanth Reddy Is Increasing Day By Day Is The Victory Of Congr

ఆ వ్యతిరేకత ఏర్పడడం వల్లే కాంగ్రెస్ పార్టీ కి బలం పెరిగిందని, పవర్ ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కారణంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల ప్రచారం లో కూడా రేవంత్ రెడ్డి కి వస్తున్నటువంటి జనాలు, కేసీఆర్ కి కానీ, కేటీఆర్ కి కానీ రావడం లేదు.వాళ్ళ సభలకు జనాలను డబ్బులిచ్చి తోలుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
The Popularity Of Revanth Reddy Is Increasing Day By Day Is The Victory Of Congr

కానీ రేవంత్ రెడ్డి కి మాత్రం స్వచ్చందంగా జనాలు భారీగా తరళి వస్తున్నారు.ఈ స్థాయి ఆదరణ బహుశా కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు రేవంత్ రెడ్డి కూడా ఊహించి ఉండరు.

ఇకపోతే నిన్న జరిగిన క్వశ్చన్ హారర్ లైవ్ ఇంటరాక్షన్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు.ఈ కార్యక్రమం లో ఆయన సిస్టం గురించి మాట్లాడిన మాటలు, ఆయనకీ ఉన్నటువంటి అవగాహన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

The Popularity Of Revanth Reddy Is Increasing Day By Day Is The Victory Of Congr

నిన్న ఈ ప్రోగ్రాం ని అక్షరాలా 20 వేల మంది లైవ్ చూస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి కి జనాల్లో ప్రస్తుతం ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.కేసీఆర్ మరియు కేటీఆర్ సభలకు కనీసం లైవ్ లో రెండు వేల మంది కూడా చూడని పరిస్థితి ఏర్పడింది.ఇటు సోషల్ మీడియా లో, అటు బయట రేవంత్ రెడ్డి డామినేషన్ ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి సంపూర్ణ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు