ల్యాండ్ అవుతుండగా.. రన్‌వే పైనుంచి దూసుకెళ్లిన విమానం!!

ఫిలిప్పీన్స్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.ఓ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు రన్‌వే పై నుంచి దూసుకెళ్లింది.

దీంతో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.అయితే ఇంత పెద్ద ఘటన చోటు చేసుకున్నా.

ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కొరియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన కేఈ631 విమానం ఈ ప్రమాదానికి గురైంది.173 మంది ప్రయాణికులతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం నుంచి ఫిలిప్పీన్స్ కు వెళ్తున్నది.అయితే ఫిలిప్పీన్స్ లోని సెబూ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది.

ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రతికూల వాతావరణం ఏర్పడింది.దీంతో విమానం ఒక్కసారిగా రన్‌వే పై నుంచి దూసుకెళ్లింది.

Advertisement
The Plane Skidded Off The Runway While Landing In Philippines Details, Philippin

ల్యాండింగ్ సరిగ్గా కాకపోవడంతో విమానం ముందుబాగం ధ్వంసమైంది.అయితే ఈ ఘటన సమయంలో ప్రయాణికులకు ఎలాంటి గాయం కాలేదు.

ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు.

అలాగే 11 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.అయితే ల్యాండింగ్ సమయంలో ప్రమాదం ఏర్పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే రన్‌వే ప్రమాదానికి గురి కావడంతో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

The Plane Skidded Off The Runway While Landing In Philippines Details, Philippin
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

సమస్య పరిష్కారమైన తర్వాత తిరిగి విమాన సేవలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు.కొందరు ప్రయాణికులు పెద్ద గండం నుంచి బయట పడ్డామని, ఈ రోజు మాకు చాలా లక్కీ డే అని చెప్పుకుంటున్నారు.

Advertisement

కాగా, ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.పైలట్ కొంచెం అజాగ్రత్త వహించినా.

అందరి ప్రాణాలు పోయేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు