గురుత్వాకర్షణ పనిచెయ్యని ప్రదేశం మనదేశంలోనే వుంది... ఎక్కడంటే?

అదేంటి, గురుత్వాకర్షణ ( Gravity )పనిచెయ్యని ప్రదేశమా? అలాంటిది కూడా వుంటుందా? అనే అనుమానం కలుగుతోంది కదా.అవును, మనదగ్గరే కలదు.

సకల సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం.ఇక్కడ ఉన్నన్ని మతాలూ, ఆచారాలు ప్రపంచంలోని మరేదేశంలో కూడా ఉండవనే విషయం ఈ ప్రపంచానికి తెలుసు.

అందుకే ఈ నేలపై పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు అని ప్రతీతి.

అసలు విషయంలోకి వెళితే.గుజరాత్ రాష్ట్రం, గిర్ సోమనాథ్ జిల్లా, తులసీ శ్యామ్ అనే ప్రదేశంలో గురుత్వాకర్షణ పనిచెయ్యదు.ఇక్కడ గురుత్వాకర్షణ లేని ఓ కొండ ఉంది.

Advertisement

అక్కడ భూమ్యాకర్షణ శక్తి పనిచెయ్యదు.సాధారణంగా కొండ ప్రాంతంలో ఓ వాహనాన్ని వదిలితే అది సరాసరి కిందకు పోతుంది.

కానీ ఇక్కడ వదిలిన వాహనాలు కొండపైకి వెళ్తాయి.ఇది కళ్లారా చూసినా కూడా నమ్మబుద్ధి కాదు.

ఇక్కడున్న తులసీ శ్యామ్ ఆలయానికి ఉత్తరంగా 400 మీటర్ల దూరంలో ఉంది ఈ కొండ.

ఇక ఇక్కడున్న తులసీ శ్యామ( Tulasi Shyama Temple ) (మహావిష్ణు) ఆలయం 3000 ఏళ్ల నాటిదని చెబుతూ వుంటారు.పురాణాల ప్రకారం.తుల్ అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు( Krishna ) అక్కడే వధించడం వలన ఆ ఆలయాన్ని తులసీశ్యామ్ అని పిలుస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆలయంలో స్వామి నల్లరాతి విగ్రహం ఉంటుంది.ఆలయానికి దగ్గర్లో సల్ఫర్ వేడి నీటి బుగ్గ ఉంది.

Advertisement

ఆ నీటికి అద్భుత శక్తి ఉందని స్థానికులు నమ్ముతారు.ఇక ఈ ప్రదేశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

వారు కూడా ఈ విషయాన్ని చాలా నమ్మకంగా చెబుతున్నారు.కాబట్టి మీరు ఓసారి అటువైపు వెళ్ళినపుడు తప్పకుండా ఆలయాన్ని మరియు ఆ కొండని దర్శించండి.

తాజా వార్తలు