జీవో నెంబర్.1 అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీవో నెంబర్.1 పై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కీలక ఆదేశాలను జారీ చేసింది.జీవో నెంబర్.1 అంశంపై దాఖలైన పిటిషన్ పై తీర్పును త్వరగా వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.అయితే జీవో నెంబర్.1పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో జనవరి నుంచి తీర్పు పెండింగ్ లో ఉందంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కాగా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్.1ను తీసుకొచ్చింది.

తాజా వార్తలు