ఏపీలో పంచాయతీ, నగర పాలక, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు కొందరి మంత్రులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.ఈ ఎన్నికల్లో సరిగా ఫలితాలు రాబట్టని మంత్రులను జగన్ తప్పిస్తారనే అంటున్నారు.
ఈ లిస్టులో చాలా మంది మంత్రులు ఉన్నా ఓ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఆ మంత్రి ఎవరో కాదు కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.
రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రి వర్గం నుంచి తొలిగించే మంత్రుల్లో గుమ్మనూరి జయరాం ఒకరని ఆయన పేరు ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంటుందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
ఆయనపై ఇప్పటికే అనేకానేక ఆరోపణలు వస్తున్నాయి.
ఆయన స్వగ్రామంలో పేకాట క్లబ్‌లపై పోలీసుల దాడులు ఆయన కుమారుడి వ్యవహారం, ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడితో జయరాం కుమారుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం ఖరీదైన కారును గిఫ్ట్ గా తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా ఆయనకు షాక్ ఇచ్చాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాల్లో నియోజకవర్గంలో పాగా వేసింది.

గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇక్కడ గట్టిగా దృష్టి పెట్టడంతో టీడీపీ 30 పంచాయతీలు గెలిచింది.నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు మేజర్ పంచాయతీలోనూ టీడీపీ మద్దతుదారు అరుణదేవి గెలుపొందారు.మంత్రిపై ఇప్పటికే ఉన్న వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లోనూ తేట తెల్లమైందనే అంటున్నారు.
ఈ క్రమంలోనే జగన్ చాలా మంది మంత్రులను బయటకు పంపించేందుకు చాలా కారణాలు లైన్లో పెట్టుకుంటున్నారట.జయరాంపై చాలా ఆరోపణలు రావడంతో పాటు స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అంత సంతృప్తిగా లేకపోవడంతో ఆయన్ను తప్పించేస్తారనే అంటున్నారు.
.