పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

పోలవరంపై నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశం ముగిసింది.పోలవరం బ్యాక్ వాటర్ పై ఇప్పటికే అధ్యయనం చేశామని కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.

2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని వెల్లడించింది.ముంపు ప్రభావంపై ఒడిస్సా, తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలవి అపోహలు మాత్రమేనని పేర్కొంది.

అంతేకాకుండా భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని కేంద్రం స్పష్టం చేసింది.పోలవరం పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.

ముంపు ప్రభావం లేకుండా కరకట కట్టేందుకు ఏపీ సిద్ధమైన ఒడిస్సా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది.ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ పై మరో మారు సర్వే చేయించాలన్న తెలంగాణ వాదనను కేంద్రం తోసిపుచ్చింది.

Advertisement

అనంతరం అక్టోబర్ 7న నాలుగు రాష్ట్రాల ఈఎన్సీ లతో కేంద్ర జల శక్తి శాఖ మరోసారి భేటీ కానున్నట్లు తెలిపింది.బ్యాక్ వాటర్ సర్వేకి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు