ఇదేదో సామెత అని అనుకొనేవారు కాబోలు.అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.
విషయంలోకి సూటిగా వెళితే, ఈ భూమిపై అమ్మ ( Mother ) ఎవరికైనా అమ్మే.అది మనిషికైనా జంతువుకైనా.
బిడ్డ క్షణం కనిపించకపోతే ఏ తల్లి మనసైనా అల్లాడిపోతోంది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కన్నబిడ్డ కంటికి కనిపించేదాకా వెతికి వెతికి వేసారిపోతుంది.
అమ్మకు తీరా బిడ్డ కనిపించగానే ఏమై పోయావురా? ఇంకొంచెం ఉంటే గుండె ఆగిపోయేది అంటూ గుండు మీద ఒక్కటిస్తుంది.ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ కదా.
ఈ అనుభవం ప్రతీ ఒక్కరికీ తమ జీవితంలో ఎదురవుతుంది.అచ్చం ఇలాంటి ఘటన ఓ పిల్లికి ( Cat ) ఎదురయ్యింది అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఇక్కడ దృశ్యాలను మీరు తప్పకుండా చూడాల్సిందే.అవును, సరిగా ఇలాగే చేసింది ఒక తల్లి పిల్లి.
( Mother Cat ) దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ కాగా దానిని చూసిన నెటిజనం చాలా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆ తల్లి పిల్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో వున్న విషయానికొస్తే, ఒకపిల్లి తన పిల్లికూనను( Kitten ) వెతుక్కుంటూ వెతుక్కుంటూ సందుగొందుల్లో తిరుగుతూ ఉంటుంది.ఇంతలో ఒకచోట ఆ బుజ్జి కూన కనిపిస్తుంది ఆ తల్లి పిల్లికి.వెంటనే ఆ తల్లి పిల్ల మరోమారు ఆలోచించకుండా చటుక్కున ఆ పిల్లి పిల్లకి ఒక్కటిచ్చి.
నోటితో కరుచుకుపోయింది.కాగా ఈ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దీన్ని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద( Chinmayi Sripada ) తోపాటు వేల కొంతమంది రీట్వీట్ చేయగా ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.ఇక ఆ దృశ్యం చూడడానికి ఎంత క్యూట్ గా వుందంటే అది మాటల్లోని చెప్పలేని ఓ అందమైన అనుభవం అనుకోక తప్పదు.
కావాలంటే మీరు కూడా ఆ అందమైన దృశ్యాన్ని చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy