కడప జిల్లా పులివెందుల కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ మేరకు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
కాల్పుల్లో గాయపడిన మస్తాన్ బాషాకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.బాషా శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
నిందితుడు భరత్ లైసెన్స్డ్ గన్ తో కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు.మరోవైపు భరత్ జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి దిలీప్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.