ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఇంటర్నెట్( Mobile Internet ) స్పీడ్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2g, 3g, 4g, 5g ఇలా కాలం మారుతున్న కొద్ది నెట్వర్క్ జనరేషన్స్ మారుతూనే ఉంది.అయితే, భారతదేశంలో కంటే పాశ్చాత్య దేశాలలో నెట్వర్క్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది.పాశ్చాత్య దేశాలలో ముందుగా కొత్త జనరేషన్ నెట్వర్కులను వాడడం మొదలుపెట్టాక అక్కడ పరిస్థితులను అనుకూలించిన తర్వాతనే భారత్( India ) వాటిని అవలంబిస్తుంది.
దానికి కారణం లేకపోలేదు.ముఖ్యంగా విస్తీర్ణపరంగా భారతదేశంలో చాలా పెద్దగా ఉండడంతో ఒకేసారి కొత్త జనరేషన్ నెట్వర్కులను విస్తరించడం చాలా కష్ట సాధ్యమవుతుంది.

ఇకపోతే ప్రపంచంలో అత్యధిక వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్( World’s Fastest Internet ) ఏ దేశాలు అందిస్తాయో ఓసారి చూద్దామా.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( UAE ) 398.51 Mbps మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తూ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఆ తర్వాత ఖతార్‌లో( Qatar ) 344.34 Mbps ఇంటర్నెట్ స్పీడ్, కువైట్( Kuwait ) 239.83 Mbps స్పీడ్, దక్షిణ కొరియా( South Korea ) 141.23 Mbps స్పీడ్,

నెదర్లాండ్స్ : 133.44 Mbps , డెన్మార్క్ (130.05 Mbps), నార్వే (128.77Mbps), సౌదీ అరేబియా (122.28 Mbps), బల్గేరియా (117.64 Mbps), లక్సెంబర్గ్ (114.42 Mbps) ఇలా దేశాలు వరుసగా ఉన్నాయి.ఈ పరంగా చూస్తే భారతదేశం టాప్ 10 దేశాలలో కూడా స్థానం సంపాదించుకోలేదు.
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 6g, 7g సంబంధించిన మొబైల్ ఇంటర్నెట్ వినియోగం జరుగుతున్నట్లుగా సమాచారం.ఏదేమైనా భారతదేశంలో ఇంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ పొందాలంటే మరికొంత సమయం భారతీయులు వేచి చూడాల్సిందే.







