కుటుంబంలో చిచ్చుపెట్టారు.. జనసేన నేతలపై ముద్రగడ ఫైర్..!!

జనసేన నాయకులపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన నేతలు తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు.

తనపై తన కూతురుతో తప్పుుడు ప్రచారం చేయించారని ముద్రగడ ఆరోపించారు.అయినా తాను భయపడనని పేర్కొన్నారు.

తన కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తికి భగవంతుడే శిక్ష విధిస్తాడని తెలిపారు.తనకు ఎలాంటి పదవీకాంక్ష లేదన్న ముద్రగడ సీఎం జగన్ ( CM Jagan )కు తోడుగా ఉండటానికే తాను వచ్చానని స్పష్టం చేశారు.

అయితే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడిస్తామని, లేని పక్షంలో తన పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందిస్తూ.

Advertisement

తన తండ్రి బాధాకరమైన సవాల్ విసిరారంటూ విమర్శించారు.వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చన్న ఆమె పవన్ ను, ఆయన అభిమానులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు