ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. విజయ్ రేంజ్ కు ఈ మొత్తం చాలా తక్కువంటూ?

దిల్ రాజు బ్యానర్ నుంచి ఉగాది పండుగ కానుకగా విజయ్, మృణాల్ జంటగా నటించిన ది ఫ్యామిలీ స్టార్( The Family Star ) మూవీ విడుదల కాగా ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో యావరేజ్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద పరవాలేదనే స్థాయిలో పర్ఫామ్ చేస్తోంది.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 8.20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అని సమాచారం.విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ మొత్తం తక్కువేనని చెప్పవచ్చు.

 Vijay Devarakonda The Family Star Movie First Day Collections Details, Vijay Dev-TeluguStop.com

వరుస సెలవుల వల్ల ఈ సినిమా సులువుగానే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాల్సి ఉంది.2 గంటల 42 నిమిషాల నిడివితో రిలీజ్ కావడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యకమవుతున్నాయి.విజయ్ రేంజ్ కు కలెక్షన్లు చాలా తక్కువని నెటిజన్లు ఫీలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది.

ఒకవైపు టిల్లు స్క్వేర్( Tillu Square ) మరోవైపు మంజుమ్మల్ బాయ్స్( Manjummal Boys ) సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం కూడా ఫ్యామిలీ స్టార్ సినిమాపై ప్రభావం చూపుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఫ్యామిలీ స్టార్ కనీసం కొన్ని ఏరియాలలో అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju ) సొంతంగా విడుదల చేయడం జరిగింది.

ది ఫ్యామిలీ స్టార్ సెకండాఫ్ బెటర్ గా ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దర్శకుడు పరశురామ్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.అయితే పరశురామ్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం సులువు కావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ రేంజ్ లో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube