కాశీ ప్రసాదంగా మిల్లెట్స్ లడ్డూల పేరు.. గురించి కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం..

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నియోజక వర్గమైన వారణాసి లో గల కాశీ విశ్వనాధ ఆలయంలో మిల్లెట్‌ లతో చేసిన లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.

ఇప్పటి నుంచి దీనిని శ్రీ అన్న ప్రసాదంగా పిలుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ లడ్డులను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.వీటి తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు.

మినుములు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేస్తున్నాం.సంపూర్ణ స్వచ్ఛతను నిర్ధారిస్తాము.

ఇంతకు ముందు ప్రసాదాన్ని పిండి సెమోలినా, జీడిపప్పు మరియు బాదంతో తయారు చేసే వాళ్ళం.కానీ ఇప్పుడు సిద్ధం చేసే లడ్డూల పై ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 లోగో కూడా ఉంటుంది.

Advertisement
The Kashi Devasthanam Took A Key Decision About The Name Of Millets Laddoos As
The Kashi Devasthanam Took A Key Decision About The Name Of Millets Laddoos As

అంతే కాకుండా దేవాలయ ప్రాంగణంలో కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశాం అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత జైస్వాల్ వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే 100 గ్రాములు మరియు 200 గ్రాముల ప్యాకెట్లలో లభించే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలనే దాని పై ఈ బృందానికి శిక్షణ కూడా ఇచ్చామని దేవాలయ అధికారులు వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే లడ్డూల తయారీ నాణ్యత మరియు ప్యాకింగ్ ను వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ పరిశీలించారు.ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశంలో ఎప్పటి నుంచో మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నారు.అంతేకాకుండా జొన్న,బజ్రా మరియు మొక్కజొన్న వంటి ముతక తృణ ధాన్యాలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

బూతు సినిమాలు మళ్లీ తెలుగు తెరను ఏలనున్నాయా?
Advertisement

తాజా వార్తలు