సాధారణంగా బైక్ లవర్స్ ఇండియన్ మార్కెట్‌లో ఒక్క బైక్ రిలీజ్ అయినా సరే వెంటనే దాని డీటెయిల్స్ చెక్ చేస్తుంటారు.అయితే తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీదారు క్యూజే మోటార్ ఏకంగా నాలుగు బైకులను ఒకేసారి రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
ఈ కంపెనీ తాజాగా భారతదేశంలో ఎస్‌ఆర్‌సీ 250, ఎస్‌ఆర్‌సీ 500, ఎస్‌ఆర్‌వీ 300, ఎస్‌ఆర్‌కె 400 అనే నాలుగు కొత్త మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది ఈ నాలుగు మోటార్‌సైకిళ్లు మోటో వోల్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా పదివేల రూపాయలతో బుక్ చేయవచ్చు.
•
ఎస్‌ఆర్‌సీ 250
ఎస్‌ఆర్‌సీ 250 ఒక క్లాసిక్ మోటార్‌సైకిల్‌గా విడుదలైంది.
దీనిలో 249సీసీ, ఇన్-లైన్ 2-సిలిండర్ 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ అందించారు.ఈ ఇంజన్ 17.4 బీహెచ్‌పీ.17 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే దీనిలో ముందు భాగంలో 280మిమీ డిస్క్ బ్రేక్.వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్‌తో ఆఫర్ చేశారు.ఇందులో డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉండటం విశేషం.14-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చే దీని ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
ఎస్‌ఆర్‌సీ 500
ఎస్‌ఆర్‌సీ 500 కూడా క్లాసిక్ స్టైల్ డిజైన్‌తో వచ్చింది.ఈ బైక్ 25.5 బీహెచ్‌పీ.36ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇందులో 480సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.ముందు భాగంలో 300మిమీ డిస్క్ బ్రేక్, వెనుక 240మిమీ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.డ్యూయల్-ఛానల్ ABS అందించారు.15.5-ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చే దీని ధర రూ.2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఎస్‌ఆర్‌వీ 300

క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఎస్‌ఆర్‌వీ 300 30.3 బీహెచ్‌పీ.26ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 296సీసీ , లిక్విడ్-కూల్డ్, V-ట్విన్ ఇంజన్‌తో లాంచ్ అయింది.దీని ముందు భాగంలో 280మిమీ డిస్క్ బ్రేక్.వెనుక భాగంలో 240మిమీ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు.డ్యూయల్-ఛానల్ ABS అందించారు.13.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చే దీని ధర రూ.3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఎస్‌ఆర్‌కె 400

స్ట్రీట్ నేకెడ్ స్పోర్ట్‌స్టర్‌గా అందుబాటులోకి వచ్చిన ఎస్‌ఆర్‌కె 400 40.9 బీహెచ్‌పీ.37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.దీనిలో 400సీసీ, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ టూ-సిలిండర్ ఇంజన్ ఉంది.బ్రేకింగ్ కోసం ఇది ముందు 260మిమీ ట్విన్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 240మిమీ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.డ్యూయల్-ఛానల్ ABS, 13.5-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చే దీని రూ.3.59 లక్షలు (ఎక్స్-షోరూమ్).