సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. !

కరోనా ప్రతి వారికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ వల్ల గత సంవత్సర కాలం నుండి స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉన్నాయి.

దీని వల్ల విద్యార్ధులు ఎంతగానో నష్టపోతున్నారు.ఇక ప్రైవేట్ పాఠశాలలు అయితే క్లాసులు జరగకున్నా,ఆన్లైన్ క్లాస్‌ల పేరిట అందిన కాడికి దండుకున్నాయి.

CBSE Class 12 Board Exams Cancelled, Central Govt, Taken A Key Decision, Regardi

ఇది రాష్ట్ర విద్యా సంస్దల పరిస్దితి.ఇకపోతే సెంట్రల్ విషయానికి వస్తే.

ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం లో సీబీఎస్ఈ పరీక్షల పై చర్చించారు.ఈ నేపధ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

ఇక కరోనా వ్యాప్తి నేపధ్యంలో పరీక్షలు నిర్వహిస్తే తల్లిదండ్రులతో పాటుగా, విద్యార్ధుల్లో కూడా భయాందోళనలు నెలకొంటాయి.అందువల్ల కోవిడ్ తగ్గినాక ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఈ విషయంలో విద్యార్ధులు ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు