26 జిల్లాలతో ఏపీ మ్యాప్ వచ్చేసింది

ఏపీలో కొత్త జిల్లాలు అవతరించాయి.13 జిల్లాల రాష్ట్రం 26 జిల్లాల రాష్ట్రంగా రూపాంతరం చెందింది.తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించారు.తొలుత పార్వతీపురం మన్యం జిల్లాను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.ఆ తర్వాత వరుసగా అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాలను వరుసగా ప్రారంభించారు.అనంతరం మొత్తం 26 జిల్లాలతో కూడిన ఏపీ మ్యాప్ ను సీఎం ఆవిష్కరించారు.

 The Ap Map Came With 26 Districts , Ap Map , 26 Districts , Thadepalli , Camp-TeluguStop.com
Telugu Districts, Anakapalli, Annamayya, Ap Map, Bapatla, Godavari, Konaseema, N

ఏపీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందన్న జగన్.పరిపాలనా వికేంద్రీకరణలో అడుగు ముందుకేశామని అభిప్రాయపడ్డారు.కొత్త జిల్లాలల కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.పాలనా వికేంద్రకరణ ఒక్కటే లక్ష్యంగా కాకుండా.గిరిజనులకు ఉపయోగపడేలా, స్వాతంత్ర్య సమరయోధులు, వాగ్గేయకారులను స్మరించుకుంటూ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు జగన్ తెలిపారు.గతంలో ఉన్న జిల్లాల పేర్లను అలాగే ఉంచుతూ.

పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించామని జగన్ అన్నారు.పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

Telugu Districts, Anakapalli, Annamayya, Ap Map, Bapatla, Godavari, Konaseema, N

గత 70 ఏళ్లలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు మాత్రమే ఏర్పాటయ్యాయన్నారు.పాలనా వికేంద్రీకరణలో ఏపీ బాగా వెనుకబడిపోయిందని జగన్ అన్నారు.జానాభా పరంగా దేశంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.మహిళలకు ఆర్ధిక స్వాలంబన కోసం ప్రత్యేక పథకాలతో పాటు వారి రక్షణ కోసం దిశ యాప్ ని, దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.దేశంలో రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నామని సీఎం తెలిపారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా ఉంటున్నామన్నారు.

ఎక్కడా అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ గుర్తుచేశారు.

కొన్ని మండలాలు, గ్రామాలు రెండ జిల్లాలలోకి వెళ్లిన పరిస్థితి 12 నియోజకవర్గాల్లో ఉన్నాయన్నారు.ఇక కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.14 ఏళ్లు ఆయన సీఎంగా ఉన్నా.రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసులేక పోవడంతో కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యకమానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube