భారతీయ సంస్కృతిలో పసుపుకి చాలా విశిష్టమైన స్థానం ఉంది.వేల సంవత్సరాలుగా ఇక్కడివారి జీవితంలో పసుపు ఒక నిత్యవసర వస్తువుగా ఉంటూ వస్తోంది.
అల్లం జాతికి చెందిన ఈ దుంప రంగు మొత్తం పసుపుగా ఉండటం వలన దీనికి తెలుగులో పసుపు అనే పేరు వచ్చింది.వంటల్లో వాడే ప్రధానమైన దినసుల్లో ఒకటైన ఈ పసుపు తీసుకొచ్చే లాభాలేంటో ఓసారి చూద్దాం.
* పసుపులో కర్‌క్యుమిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటింది.ఈ పదార్థం వల్లే ఇది పసుపు రంగులో ఉండి, యాంటిసెప్టిక్, యాంటిబ్యాక్టిరియల్, యంటిఇంఫ్లేమెంటరీ గుణాలను కలిగి ఉంటుంది.
* జామ ఆకులు, పసుపు.రెండూ నూరి ముఖానికి రాసుకుండే మొటిమల బెడద తప్పుతుంది.
* మరుగుతున్న నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇంఫెక్షన్స్ వెళ్లిపోతాయి.* యాంటిసెప్టిక్, యాంటిబ్యాక్టిరియల్, యంటిఇంఫ్లేమెంటరీ గుణాలను కలిగి ఉండటం వలన గాయాలు, వాపులపై పసుపు రాస్తే ఉపశమనం పొందవచ్చు.
రక్తస్రావం జరుగుతున్నప్పుడు దీన్ని ఫస్ట్ ఏయిడ్ లా వాడుకోవచ్చు.* పసుపులో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి.
అందుకే పసుపు ఇంటేక్ పెరిగినా కొద్ది రోగనిరోధక పెరుగుతూ ఉంటుంది.
* క్యాన్సర్, ట్యూమర్స్ ని అడ్డుకునే శక్తి, నయం చేసే శక్తి పసుపులో ఉంటుంది.కర్‌క్యుమిన్ అనే పదార్థమే పసుపులో ఈ శక్తికి కారణం.* ఆయిల్ స్కిన్ తో బాధపడేవారికి, ముఖం యొక్క రంగు పెంచుకోవాలనుకునే వారికి, సున్నితమైన చర్మం కావాలనుకునేవారికి పసుపుని మించిన నేస్తం దొరకదు.
* పసుపు గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ట్రాక్ లో పెడుతుంది.* బ్యాడ్ కొలెస్టరాల్ ని చాలావరకు తగ్గిస్తుంది పసుపు.
అందుకే దీన్ని పాలలో కలుపుకోని తాగడానికి ఏమాత్రం సంశయించవద్దు.* అంతేకాదు, అధికబరువు సమస్య, మతిమరుపు, పీరియడ్స్ లో సమస్యలు, జీర్ణ సమస్యలు, లివర్ సమస్యలు .ఇలా చెప్పుకుంటూ పోతే పసుపు దాదాపు అన్నిరకాల సమస్యలతో పోరాడగలదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy