ఆ నెంబర్ తో వచ్చే 'వాట్సాప్' మెస్సేజ్ లు ఓపెన్ చేశారో ఇక అంతే !

వాట్సాప్ లో నకిలీ అకౌంట్ల బెడద ఎక్కువైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.+1,+44 నెంబర్లతో ఫేక్ మెసేజ్ లు షేర్ అవుతున్నాయని, ఆ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూకేకి చెందిన Fw calls అనే వెబ్సైట్ నుండి షేర్ అవుతున్నట్లు చెప్పారు.

ఈ మెసేజ్ లు ఓపెన్ చేయడం వల్ల అన్నీ రకాల సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

+1తో ప్రారంభమై +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి.ఈ ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి.కాబట్టి +1 నెంబర్తో వచ్చే వాట్సాప్ మెసెజ్లను మాత్రం నమ్మకండి.

ఇంకా చెప్పాలంటే వాట్సప్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోను బట్టి కూడా నకిలీ అకౌంట్లను గుర్తించవచ్చు.

Advertisement

ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో ఉంటుంది కానీ ఒరిజినల్ లోగో మాదిరి ఉండదు స్టేటస్ స్థానంలో Hey there! Im using WhatsApp అని ప్రత్యేకమైన ఫాంట్తో ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది.కాబట్టి వాటిని దూరంగా పెట్టడమే కాకుండా చాటింగ్ చేయడం కూడా మానేయండి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు