నేను ఎక్కువగా భయపడింది దానికే... ఎక్కడికి వెళ్ళినా నన్ను వదలలేదు: అలియా భట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకు పోతున్న నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె కేవలం బాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం గంగూబాయి కథియావాడి.ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఒక చిన్న పాత్రలో నైనా నటించాలనేది తన డ్రీమ్ అని అలాంటిది ఈ సినిమాలో నటించే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు.అయితే ముందుగా సంజయ్ సర్ ఈ పాత్ర గురించి తనకు చెప్పినప్పుడు కాస్త భయపడ్డానని అయితే తను భయపడాల్సిన పనిలేదు నేనున్నానని ధైర్యం ఇచ్చారని అలియా తెలియజేశారు.

That What I Feared Never Left Me Wherever I Went By Alia Bhatt Alia Bhatt, Bolly

ఈ క్రమంలోనే మొదటిసారి గంగుబాయి కథియావాడీ సెట్ లోకి అడుగు పెట్టగానే తనలో ఏదో తెలియని భయం వచ్చిందని ఆ తరువాత తన పాత్ర ఎలా ఉండ బోతుందో అప్పుడే అర్థమైందని, పూర్తిగా ఆ పాత్ర లోకి మారడం కోసం తాను చాలా ప్రయత్నాలు చేశానని తెలియజేశారు.ఇలా ఈ పాత్రలో నటించడం కోసం మొదట్లో ఎంతో భయపడ్డానని ఆ భయం ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడేదని మెల్లమెల్లగా ఈ పాత్రలో లీనమై పోయానని అలియా తెలియజేశారు.నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది సంజయ్ సర్ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
That What I Feared Never Left Me Wherever I Went By Alia Bhatt Alia Bhatt, Bolly
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు