ఆ హీరో నాకు ఎంతో స్ఫూర్తి.. ఆయన ఇంటర్వ్యూలు అస్సలు మిస్ అవ్వను: నిఖిల్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు నిఖిల్.

ఈ సినిమా మంచి హిట్ కావడంతో నిఖిల్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈయన కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో హీరో నిఖిల్ కు పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ విధంగా కార్తికేయ 2 సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నటువంటి ఈయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిఖిల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తనకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ఆయనే తన అభిమాన హీరో అంటూ తెలియజేశారు.షారుఖ్ ఖాన్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా చూస్తానని ఇక ఆయన ఇంటర్వ్యూలు కూడా ఏమాత్రం మిస్ అవ్వను అంటూ ఈయన తెలియజేశారు.

That Hero Is A Great Inspiration To Me I Don T Miss His Interviews At All Nikhil
Advertisement
That Hero Is A Great Inspiration To Me I Don T Miss His Interviews At All Nikhil

ఇకపోతే నేను ఇండస్ట్రీలోకి రావడానికి షారుఖ్ ఖాన్ ఎంతో స్ఫూర్తి.ఒక సాధారణ హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ఈయన కింగ్ కాన్ గా ఎదగడం తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని వెల్లడించారు.ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గురించి నిఖిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే కార్తికేయ2 తర్వాత అదే అంచనాలు నడుమ 18 పేజెస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపోతే కార్తికేయ 2 విజయం కావడంతో కార్తికేయ 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు.

ఇకపోతే కార్తికేయ2 సినిమా నేటి నుంచి జీ 5 లో ప్రసారం కానుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు