vijay : గడ్డ కట్టించే చలిలో షూటింగ్ చేస్తున్న స్టార్ హీరో.. అది చూసిన ఫ్యాన్స్ షాక్?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హీరో విజయ్ కి తమిళం తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ వారసుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తమిళంలో వారీసు పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నీ అందుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హీరో విజయ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో( Leo ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని తాజాగా కాశ్మీర్ లో పూర్తి చేసుకున్నారు చిత్ర బృందం.దాదాపు 56 రోజులపాటు అక్కడే గడిపిన చిత్ర బృందం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.అనంతరం కాస్ట్ అండ్ క్రూ చెన్నైకి చేరుకుంది.

Advertisement

ఈ సందర్భంగా కశ్మీర్ షెడ్యూల్ లో సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు మూవీ మేకర్.ఆ వీడియోలో కాశ్మీర్ షెడ్యూల్లో తమ సిబ్బంది ఎంతో కష్టపడిందని, కాశ్మీర్లోని పలు ప్రాంతాలలో లియో సినిమా షూటింగ్ జరిగిందని ఆ షూటింగ్లో ప్రధాన క్రాఫ్ట్స్ అన్ని పని చేశాయని తెలిపారు.

కాశ్మీర్ షూటింగ్లో -10 డిగ్రీస్ టెంపరేచర్( Kashmir ) లో పనిచేయాల్సి వచ్చింది అని తెలిపారు మూవీ మేకర్స్.

చలికి వణుకుతూనే షూటింగ్ నీ పూర్తి చేశారని తెలిపారు.రాత్రి పగలు షూటింగ్ జరిగిందని ముఖ్యంగా అక్కడి చలి, మంచు, మంచు వర్షం పడుతున్న కూడా ఆగకుండా షూటింగ్ పనులు నిర్వహించినట్లు తెలిపారు.రాత్రి, పగలు వాతావరణం మారుతున్నా కూడా టఫ్ వెదర్ ను దాటుకొని షూటింగ్ పనులు కొసాగించినట్లు తెలిపారు.

రాత్రి సమయంలో -10 నుంచి -2 డిగ్రీల టెంపరేచర్ లో కూడా వర్క్ చేసినట్లు చెప్పుకొచ్చారు చిత్ర బృందం.తమ చేతులు బిగుసుకపోయాయని, అయినా లోకేషన్లలో చాలా వేగంగా పనిచేశామని వెల్లడించారు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు విజయ్ కి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు.

Advertisement

అంత చలిలో విజయ్ షూటింగ్లో పాల్గొనడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

తాజా వార్తలు