దళపతి విజయ్( Thalapathi vijay ) తెలుగు నిర్మాత దిల్ రాజు తో వారిసు సినిమా ( Varisu )చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా ముందు బైలింగ్వల్ గా తీయాలని అనుకుని సినిమా స్టార్ట్ అయ్యే టైం లో కేవలం తమిళ వెర్షన్ కే పరిమితం అయ్యారు.
వారిసు తెలుగు డబ్బింగ్ వెర్షన్ వారసుడుగా వచ్చినా సోసోగానే ఆడింది.అయితే ఈలోగా దళపతి విజయ్ తెలుగులో మరో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj ) తో విజయ్ లియో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే తమిళ దర్శకుడితోనే నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

కానీ తెలుగు మీడియా మాత్రం విజయ్ తెలుగు సినిమా చేస్తాడని వార్తలు రాస్తున్నారు.అసలు దళపతి విజయ్ కి తెలుగు సినిమా చేయాలన్న ఆసక్తి లేదట.ఆల్రెడీ తన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి మంచి కంటెంట్ ఉంటే ఎలాగు అక్కడ వర్క్ అవుట్ అవుతున్నాయి దానికి ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ ఎందుకు చేయడం అన్నట్టుగా ఆయన అంటున్నారట.తెలుగులో తీయకపోయినా ఇక్కడ రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కి రాకపోవడం తెలుగు ఆడియన్స్ ని హర్ట్ చేస్తుంది.
ఏది ఏమైనా విజయ్ తెలుగు స్ట్రైట్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.







