కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయిల్ ఫ్యాక్టరీ ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.కాగా, మృతులలో ఐదుగురు పాడేరు, ఇద్దరు పులిమేరుకు చెందిన వారిగా గుర్తించారు.
మరోవైపు ప్రమాద ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా… కలెక్టర్, ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఏడుగురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.