మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు ఇవాళ్టి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వాటిని విజయవంతం చేసేందుకు గిరిజన గ్రామాల్లో మావోలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ, తెలంగాణ పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.ఏజెన్సీలో నిఘా ఏర్పాటు చేయగా పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
దాంతో పాటు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.కాగా నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ఆగస్ట్ 3వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇందులో భాగంగా అమరుల జ్ఞాపకార్థం స్థూపాలు నిర్మించి నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.