తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.భారతీయ అమెరికన్ కు 5.30 కోట్ల జరిమానా

-74-crore-scam.jpg"/>

అమెరికాలో వెలుగు చూసిన ఐ ప్యాడ్ స్కాం లో  భారతీయ అమెరికన్ సౌరబ్ చావ్లా కు ఐదున్నరెళ్ళ జైలు శిక్ష పడింది.

2.27 వ ఉగాది ఉత్తమ రచన పోటీలు

ఏప్రిల్ 1 2022 ఉగాది ని పురస్కరించుకుని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ స్థాయిలో 27 వ ఉగాది ఉత్తమ రచన పోటీలు నిర్వహిస్తున్నారు.మార్చి 15 వ తేదీ లోపు తమ రచనలను ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

3.టోంగా లో సునామీ హెచ్చరికలు

టోంగో దీవిలో అగ్ని పర్వతం బద్దలయ్యింది.పెద్ద ఎత్తున వచ్చిన బూడిద 20 కిలో మీటర్ల వరకు వ్యాపించింది.

4.యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా, ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ చేసుకునే విధంగా 100 కోట్ల ర్యాపిడ్ కిట్ల తో పాటు, ఎన్ 95 మాస్క్ లను ఉచితంగా అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు.

5.పాకిస్తాన్ లో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై 5.6 గా నమోదయింది.

6.రష్యాకు అమెరికా బెదిరింపు

మధ్య ఆసియాలోని ఉక్రెయిన్ లో తన సేనలను దించి రష్యాకు వ్యతిరేకంగా అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతున్న క్రమంలో రష్యా కూడా తన సైన్యాన్ని అక్కడ మొహరించింది.దీంతో వెంటనే సైన్యాన్ని వెన్నక్కి పిలిపించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ అమెరికా హెచ్చరికలు చేసింది.

7.మళ్లీ నిర్బంధంలో జాకోవిచ్

టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన సందర్భంలో ఆయన వీసాని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.

8.గూగుల్ ఉద్యోగులకు ప్రతి వారం టెస్ట్ లు తప్పనిసరి

Advertisement

గూగుల్ ఉద్యోగులకు ప్రతి వారం కరోనా టెస్ట్ కు తప్పనిసరి అని ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

9.భారత సంతతి వ్యక్తికి బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశం

ప్రస్తుత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునక్  పేరు బ్రిటన్ ప్రధానిగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు