తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్22, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.09

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.9.20 ల10.30 సా4.40 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

సింహం:

ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల బంధువులను ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో అదృష్టం కలిసి వస్తుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనులు మధ్యలోనే ఆగిపోతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

తాజా వార్తలు