తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.4.22 ల6.30

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12

ల2.46 ల3.34

మేషం:

ఈరోజు ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి.నూతన వస్తులాభాలు పొందుతారు.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి.

గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన లేడీ ఎస్సై
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు31, శనివారం 2024

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి.

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.నూతన వాహనయోగం ఉన్నది.

వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం:

ఈరోజు బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు.స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం:

ఈరోజు సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం:

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా పడతాయి.చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు.

ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.

కన్య:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల:

ఈరోజు నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు.బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ప్రయాణాలలో మార్పులు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు.ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది.పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం:

ఈరోజు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి.గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి.సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం:

ఈరోజు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు.

దీర్ఘకాలిక రుణాల వలన ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు.

ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

మీనం:

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.

మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తాజా వార్తలు