తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 23 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.02

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం: ఉ.10.40 నుంచి 12.27 వరకు

అమృత ఘడియలు: ఉ.06.20 నుంచి 07.05 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 23 Friday 2020-తెల

దుర్ముహూర్తం: ఉ.08.22 నుంచి 09.09 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు ఈ రాశి వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది.ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో నిమఘ్నమవుతారు.

దీని మూలంగా మీరు అందరి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు.వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి.

అనవసరమైన ఖర్చులు చేయకుండా జగ్రత్తపడండి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వృషభం:

ఈ రాశి వారిని తమ ప్రత్యర్థులు వీరిని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు.తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి.

Advertisement

తొందరపాటుతో ఎలాంటి పనులు చేయకూడదు.ఏదైనా కొత్త వాటిని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు.

వీలైనంత వరకు మీపనులను తొందరగా ముగించుకని మీ కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించండి.

మిథునం:

ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమతూల్యంగా ఉంటుంది.వ్యాపార రంగంలో తమ కంటూ విజయం సాధిస్తారు.టుంబంలో కొత్త సంతోషాలను తీసుకొస్తారు.

శుభవార్తల వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.స్నేహితులు మీ వద్దకు వస్తారు.

వారితో మరచిపోని క్షణాలను పొందుతారు.

కర్కాటకం:

ఈ రోజు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.ఫలితంగా పనుల మీద ఆసక్తి పెరుగుతుంది.ఒక నిర్ణయం తీసుకోవడం మూలంగా మీరు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు.సమాజ సంబంధాల మూలంగా మీరు ఉల్లాసంగా గడుపుతారు.

ప్రజలు మీచే ప్రభావితమవుతారు.

సింహం:

ఈ రోజు మీరు ప్రతి విషయంలోనూ అదృష్టం పొందుతారు.అన్ని పనుల్లో మీరు విజయం సాధిస్తారు.ప్రాపంచిన ఆనందం కోసం ఖర్చులు చేస్తారు.

ఫలితంగా మానసికంగా సంతోషంగా ఉంటారు.ఎంతో కాలంగా ఉన్న గొడవలు పరస్ఫర ఒప్పందం ద్వారా అంతమవుతాయి.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబం కోసం మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది.

కన్య:

ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు లభిస్తాయి.వృద్ధుల సేవలో పాల్గొని సంతోషంగా గడుపుతారు.ప్రత్యర్థులకు మీరు సవాలుగా నిలుస్తారు.

వైవాహిక జీవితంలో సంతోషంగా జీవిస్తారు.స్నేహితుల సహాయంతో విజయం సాధిస్తారు.

ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు.ఈ రోజు అతిథులు వచ్చే అవకాశం కూడా ఉంది.

తులా:

ఈ రోజు ఈ రాశి వారికి సవాలు ఎదురుకాబోతోంది.దాని కోసం కష్టపడినప్పటికీ ఫలితం అంతగా రాకపోవచ్చు.ఆదాయం తక్కువగా ఉంటుంది.

కాని ఖర్చు మాత్రం అధికంగా చేస్తారు.రహస్య శత్రువులు మూలంగా మీ కుటుంబం సంతోషంగా ఉండదు.

సాయంత్రం కొంత వరకు వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఫలితంగా కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

ఈ రో జు వ్యాపారవేత్తలకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలన్ని మీకే వస్తాయి.అది మీకు అనుకూలంగా ఉంటుంది.

మీ పని తనంతో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనస్సు:

ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆదాయం పెరుగుతుంది.అన్నింట్లో విజయం మీదే అవుతుంది.

ఈ రోజు మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు.మీకు మంచి సంకల్పం ఏర్పడుతుంది.

ఫలితంగా మీకు కీర్తి పెరుగుతుంది.ఈ రోజు మీరు చేపట్టిన అన్ని పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు.

దానితో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈ రోజు మీకు అన్నీ సానుకూలంగా ఉంటాయి.చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.కొంత మంది వ్యక్తులను కలవడం ద్వారా మీకు శుభఫలితాలొస్తాయి.

గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని సమసిపోతాయి.ఉన్నతాధికారుల వల్ల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

కుంభం:

ఈ రోజు ఈ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రాంతాల నుంచి ప్రయోజనం పొందుతారు.పెట్టిన పెట్టుబడులకు మంచి లాభం పొందుతారు.

కష్టపడి పనిచేసి వారికి మంచి ఫలితాలు పొందుతారు.కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు.

వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.ఉద్యోగ, వ్యాపర రంగంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు.

మీనం:

ఈ రాశివారికి ఈ రోజు గ్రహాల స్థాన బలం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.కొత్తగా ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి.మీరు చేసే మంచి పనుల వలన మంచి పేరు ప్రకాశిస్తుంది.

వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం వలన ప్రయోజనం పొందుతారు.భార్య నుంచి ప్రేమా, ఆప్యాయతలు పొందుతారు.

తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది.వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తాజా వార్తలు