తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 17 , మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

58

రాహుకాలం:మ 3.00 సా.4.30 వరకు

అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల 9.23 ల11.15 మ12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వృషభం:

Advertisement

ఈరోజు మీరు పని చేస్తే చోట అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తిరగలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక వర్ధంతి గురయ్యా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తరచు మార్చుకునే నిర్ణయం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు ఇతరుల మాటలు మనసుని నొప్పిస్తాయి.అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.

తాజా వార్తలు