తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) త్వరలో ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కొత్త సీజన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త హోస్ట్ గురించి జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇప్పటి వరకు నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున( Nagarjuna ) ఇక తన వల్ల కాదు అన్నట్లుగా బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పేసాడు అనే సమాచారం అందుతుంది.
బిగ్ బాస్ చేస్తున్న సమయం లో నాగార్జున సినిమా లపై ఎక్కువ దృష్టిని పెట్టలేక పోతున్నాడు.అందుకే ఆయన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.అందుకే బిగ్ బాస్ ని పక్కకు పెట్టి సినిమా లపై దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లయితే సమాచారం అందుతుంది.
ప్రస్తుతం నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్( Prasanna Kumar ) దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.

ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.మరో వైపు బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త హోస్ట్ ఎంపిక విషయం లో నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది తెలియక బిగ్ బాస్ ( Big Boss )ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.ఎప్పటికీ కొత్త హోస్ట్ వస్తాడు.
కొత్త హోస్ట్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది తెలియక అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బిగ్బాస్ యొక్క కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల ప్రముఖ యాంకర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు నిర్వాహకులు సంప్రదించారని కూడా ప్రచారం జరిగింది.అదే కనుక నిజమైతే ఇప్పటికే హోస్ట్ ఎంపిక జరిగి ఉంటుంది.
హోస్ట్ గా ఎవరినో ఒకరిని కన్ఫర్మ్ చేసిన తర్వాతే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బిగ్ బాస్ కి చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ ని నడిపించారు.
కొత్తగా రాబోతున్న హీరో ఎలా హోస్టింగ్ చేస్తాడు అనేది చూడాలి.







