ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పాప ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్ అని మీకు తెలుసా...

టాలీవుడ్ బుల్లితెర మీద తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈమె ఒకపక్క పలు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరో పక్క సినిమాలలో స్పెషల్ పాటలు, ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.

అయితే తాజాగా యాంకర్ అనసూయకి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.ఒకసారి ఆ ఫోటోని పరిశీలించినట్లయితే చిన్నప్పుడు యాంకర్ అనసూయ తన తల్లితో కలిసి దిగినట్లు తెలుస్తోంది.

దీంతో కొందరు నెటిజన్లు చిన్నప్పుడు యాంకర్ అనసూయ ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.అలాగే యాంకర్ అనసూయ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న టువంటి "ఫైటర్" అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Advertisement

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు బుల్లితెర అటు వెండితెర కవర్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తోంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు