హరహర వీరమల్లు కథ ఏంటో చెప్పేసిన సీనియర్ నటుడు...

తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటిస్తుండగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న  హరహర వీరమల్లు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాగా మంచి స్పందన లభించింది.

ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా తాను పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించానని చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో తాను ఓ ఇంటి ఓనర్ పాత్రలో కనిపించానని తెలిపాడు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరహర వీరమల్లు చిత్రంలో కూడా తాను ప్రాధాన్యత ఉన్న  పాత్రలో నటించానని ఇందుకుగాను దాదాపుగా పది రోజుల పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపాడు.

Telugu Actor Subhalekha Sudhakar React About Pawan New Movie Hara Hara Veeramall
Advertisement
Telugu Actor Subhalekha Sudhakar React About Pawan New Movie Hara Hara Veeramall

అయితే ఈ చిత్ర కథ విషయం గురించి స్పందిస్తూ ఈ చిత్రం కొంతమేర పౌరాణికంగా ఉంటుందని కానీ పూర్తిగా పౌరాణికం మాత్రం కాదని అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం చిత్రం తరహాహలో ఉండబోతుందని తెలిపాడు.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇక తన నటనా ప్రస్థానం గురించి స్పందిస్తూ తాను తన జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలలో మాత్రమే నటించాలని ఎలాంటి ఆంక్షలు లేదా షరతులు పెట్టుకోలేదని అందువల్లనే ఇప్పటివరకు నటుడిగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తాను మరణించేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని కాబట్టి అందుకు కావలసినటువంటి శక్తి, సహకారాలను ఆ దేవుడు అందించాలని రోజూ ప్రార్థన చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.కాగా ప్రస్తుతం శుభలేఖ సుధాకర్ తెలుగులో దాదాపుగా 5కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాతి రత్నాలు, భీష్మ, తదితర చిత్రాల్లో కూడా కనిపించి బాగానే అలరించాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు